షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
కావలి (అల్లూరు): పట్టణంలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్ షూటింగ్ బాల్ పోటీలను గురువారం ప్రారంభించారు. 18 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్డీఓ పాండురంగారావు మాట్లాడారు. రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని చెప్పారు. క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. వచ్చే నెల్లో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నామని వివరించారు. కళాశాల ఏఓ రమేష్‌బాబు, ప్రిన్సిపల్ టీవీరావు, అసోసియేషన్ సభ్యులు కిరణ్‌కుమార్, జయరావు, నాగరాజు, విజయ్‌కుమార్, నరేష్‌బాబు, వేణుగోపాల్, గణేష్, పోటీల నిర్వాహకుడు మురళి, హరి తదితరులు పాల్గొన్నారు.
కనియంపాడులో
పోలీస్ పికెట్
వరికుంటపాడు: మండలంలోని కనియంపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్‌ను ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు, ఎస్సై రఘునాథ్ గురువారం ఏర్పాటు చేశారు. గాయపడిన గుర్రం భాస్కర్‌రెడ్డి, బిజ్జం వెంకటరెడ్డి, పాణ్యం శ్రీనివాసులు.. వరికుంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేడుకగా కలభాభిషేకం
నెల్లూరు(బృందావనం): మండల పూజలను పురస్కరించుకొని నగరంలోని అయ్యప్ప దేవస్థానంలో కలభాభిషేకాన్ని గురువారం ప్రారంభించారు. చందనాలంకారంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చారు. నిర్మాల్య దర్శనం, క్షీరాభిషేకం, మహోగణపతి హోమం, శీవేలి ఉత్సవం తదితరాలను వేడుకగా జరిపారు. ఉభయకర్తలుగా కుందా సూర్యనారాయణరెడ్డి, ప్రభావతి, కందాటి వెంకటేష్, స్వర్ణ, అల్లాడి హేమ, వెంకటసిద్ధుకృష్ణ, మాచవరం సునీల్, యషిత దంపతులు, సరోజనమ్మ కుటుంబసభ్యులు వ్యవహరించారు. అయ్యప్ప సేవా సమాజ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం, సభ్యులు పావళ్ల ప్రసాద్, మురళీమోహన్‌రెడ్డి, పసుపులేటి అశోక్‌చంద్ర తదితరులు పర్యవేక్షించారు.
4న బలిజ విద్యార్థులకు
ప్రతిభ పురస్కారాల ప్రదానం
సంగం: జిల్లాలో గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేయనున్నామని బలిజ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు పోకల రవికుమార్, ప్రధాన కార్యదర్శి కమతం సుబ్బారావు తెలిపారు. సంగంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో గల కాపు భవన్‌లో వీటిని జనవరి నాలుగున అందజేయనున్నామని వివరించారు. పదో తరగతిలో 575కుపైగా, ఇంటర్మీడియట్‌లో 970కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున నగదు, ప్రశంసపత్రాలను అందజేయనున్నామని చెప్పా రు. జిల్లాలోని బలిజ సంఘీయులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. బలిజ సేవా ఫౌండేషన్ సభ్యులు చలపతి, తోట భాస్కర్, సురేంద్ర, సుధాకర్, మధుసూదన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం


