క్రిస్మస్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలి
నెల్లూరు సిటీ: క్రిస్మస్‌ను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత వేర్వేరు ప్రకటనల్లో బుధవారం కాంక్షించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు.
యేసుక్రీస్తు ఆశీస్సులు
ఎల్లవేళలా ఉండాలి
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా ప్రజలపై యేసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండాలని.. ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్థిల్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ఈ మేరకు క్రిస్మస్ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు.
పారిశ్రామికవేత్తలతో
అవగాహన సదస్సు రేపు
నెల్లూరు సిటీ: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో అవగాహన సదస్సును నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం నిర్వహించనున్నామని జిల్లా ప్రజారవాణాధికారి షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవూరు బస్టాండ్, ఆత్మకూరు డిపో పరిధిలోని ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇందులో భాగంగా సందేహాలను నివృత్తి చేసేందుకు గానూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వెల్లడించారు.
కబడ్డీ మహిళా జట్టు
ఎంపికలు రేపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా మహిళా కబడ్డీ జట్టును రంగనాయకులపేటలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో శుక్రవారం ఎంపిక చేయనున్నామని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరీష్, గంటా సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 కిలోల్లోపు బరువున్న వారు అర్హులని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవానరంలో వచ్చే నెల్లో నిర్వహించనున్న అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వివరించారు.
లైసెన్స్‌ల పునరుద్ధరణకు
గడువు పొడిగింపు
మర్రిపాడు: పంట కాలం 2025 – 28కు సంబంధించిన పొగాకు సాగుకు లైసెన్స్‌ల పునరుద్ధరణకు గడువును జనవరి ఐదు వరకు పొడిగించామని డీసీపల్లి వేలం కేంద్ర నిర్వహణాధికారి రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.400 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆపై ఎలాంటి అవకాశం ఉండదని, వివరాలకు బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
లారీని ఢీకొన్న కారు
● నెల్లూరు వాసులకు స్వల్ప గాయాలు
నాయుడుపేటటౌన్: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన వారు చైన్నె వైద్యశాలలో ఉన్న వ్యక్తిని తీసుకొని కారులో బయల్దేరారు. వాహనం బిరదవాడ గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగింది. దీంతో కారు అదుపుతప్పి ఢీకొంది. ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు మరో కారులో నెల్లూరు వెళ్లారు. కారు ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రిస్మస్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలి
క్రిస్మస్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలి


