కరేడులో భారీ చోరీ
● 18 సవర్ల బంగారం అపహరణ
ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామంలో రిటైర్డు టీచర్ ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కరేడుకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయురాలు ఉల్చి కమలాదేవి ఉంటోంది. భర్త 19 ఏళ్ల క్రితం మరణించాడు. సంతానం లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈనెల 14వ తేదీ గాల్‌బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంటికి తాళాలు వేసి తిరుపతికి వెళ్లింది. అయితే ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయని, తలుపు తెరిచి ఉన్నాయని స్థానికులు మంగళవారం శింగరాయకొండలోని కమలాదేవి మరిది చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెళ్లి పరిశీలించాడు. ఇంటి ప్రధాన ద్వారం పగులగొట్టి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగలు బీరువాను పగులగొట్టి 4 జతల కమ్మలు, 4 జతల బంగారు దండలు, వెండి పూజా సామగ్రి ఎత్తుకెళ్లారు. మొత్తం బంగారం 18 సవర్లు, అర కేజీ వెండి అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్‌బాషా ఇంటిని సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించింది. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
వైద్యం అందక వ్యక్తి మృతి
● గుండెపోటుతో సీహెచ్‌సీకి వెళ్లిన టీడీపీ నాయకుడు
● టిఫిన్‌కు వెళ్లిన డ్యూటీ డాక్టర్
● వైద్యుడిని సస్పెండ్ చేయాలని బంధువుల ధర్నా
ఉలవపాడు: అనారోగ్యంతో వైద్యశాలకు వెళ్లిన వ్యక్తికి సరైన సమయంలో వైద్యం అందక మృతిచెందాడు. ఈ ఘటన ఉలవపాడులోని సీహెచ్‌సీ వైద్యశాలలో జరిగింది. బంధువుల కథనం మేరకు.. ఉలవపాడు అంబేడ్కర్ నగర్‌కు చెందిన టీడీపీ నాయకుడు, సీహెచ్‌సీ వైద్యశాల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ దార్ల మల్లికార్జున (45) బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైద్యశాలకు వెళ్లి గుండెనొప్పిగా ఉందని చెప్పాడు. వైద్యులు చూసి ఈసీజీ బాగుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పారు. దీంతో మల్లికార్జున సాయంత్రం బస్టాండ్‌కు వెళ్లాడు. అయినా గుండె వద్ద ఇబ్బందిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో వారు మళ్లీ సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అప్పుడు డ్యూటీ డాక్టర్ చంద్రేష్ లేడు. కొంతసేపటికి నర్సు వచ్చి పరిశీలించి ఈసీజీ తీసి డాక్టర్‌కు వాట్సాప్‌లో పెట్టింది. అప్పటికీ కూడా వైద్యుడు రాలేదు. ఈలోపు మల్లికార్జున మరణించాడు. దీంతో బంధువులు డాక్టర్, సిబ్బందిని విధుల సస్పెండ్ చేయాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. రూ.40 వేల విలువైన ఇంజెక్షన్లు వైద్యశాలలో ఉన్నాయని చెబుతున్నా ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రేష్ మాట్లాడుతూ మల్లికార్జున ఆస్పత్రికి రాగానే నర్సు ఈసీజీ తీసిందన్నారు. తాను ఆ సమయంలో టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్లానని, వచ్చేలోగా అతను చనిపోయినట్లు చెప్పారు.
పొదలకూరు నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.15
సన్నవి: రూ.10
పండ్లు: రూ.3
ధర్నాలో పాల్గొన్న మృతుడి బంధువులు, మాజీ ఎమ్మెల్యే శివరామ్
మల్లికార్జున మృతదేహం
కరేడులో భారీ చోరీ
కరేడులో భారీ చోరీ


