పరీక్షలు, మూల్యాంకనంతో బిజీ | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు, మూల్యాంకనంతో బిజీ

Nov 25 2025 5:48 PM | Updated on Nov 25 2025 5:48 PM

పరీక్

పరీక్షలు, మూల్యాంకనంతో బిజీ

●పదో తరగతి విద్యార్థులకు
వంద రోజుల ప్రణాళిక

నెల్లూరు (టౌన్‌): రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం పొంచి ఉంది. పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్ల కొరతతో సిలబస్‌ ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ పరీక్షల నిర్వహణ, వాటి మూల్యాంకనం, మార్కుల అప్‌లోడ్‌తో ఉపాధ్యాయులు బిజీగా ఉన్నారు. మరోవైపు డిసెంబర్‌ ఐదు నాటికి పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేసి, మరుసటి రోజు నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారు.

వార్షిక ప్లాన్‌లో మరోలా..

తమకిచ్చిన ఇయర్‌ ప్లానింగ్‌లో మాత్రం సిలబస్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జనవరి నుంచి రివిజన్‌ను ప్రారంభించాలనే అంశాన్ని పొందుపర్చారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గతంలో జనవరి ప్రా రంభం నుంచి రివిజన్‌ను మొదలుపెట్టేవారు. అయితే సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలనే అధికారుల ఆదేశాలతో టీచర్లు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒత్తిడితో సిలబస్‌ను అరకొరగా బోధించి ముగించే పనిలో ఉన్నారు. అర్థవంతమైన రీతిలో బోధించకపోతుండటంతో పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే ఆందోళనలో విద్యార్థులున్నారు.

విరుద్ధంగా పరిస్థితి

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 724 ఉన్నా యి. ఇందులో 29,706 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే ప్రైవేట్‌ స్కూళ్లతో పోలిస్తే సర్కారీ పాఠశాలల్లో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ విద్యా సంవత్సర ప్రారంభం నుంచే సబ్జెక్ట్‌ టీచర్లకు కొరత ఉంది. మరోవైపు జూన్‌లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. అయితే చాలా చోట్ల రిలీవర్లు లేక అక్కడే ఆగిన పరిస్థితీ ఉంది. డీఎస్సీ – 2025కు సంబంధించి 657 మంది అక్టోబర్‌ రెండో వారంలో విధుల్లో చేరారు. వీరిలో 542 మంది స్కూల్‌ అసిస్టెంట్లున్నారు. అయినా నేటికి కొన్ని చోట్ల హిందీ, మ్యాథ్స్‌ , ఫిజిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించి టీచర్ల కొరత నెలకొంది. వీరి స్థానంలో వేరే సబ్జెక్ట్‌ టీచర్లను పంపినా, విద్యార్థులకు అర్థవంతంగా బోధించే పరిస్థితి లేదు.

జెడ్పీ హైస్కూల్లో పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులు (ఫైల్‌)

వచ్చే నెల

ఆరు నుంచి అమలుకు ఆదేశాలు

గతంలో జనవరి ప్రారంభం నుంచి ప్రణాళిక

డిసెంబర్‌ ఐదు నాటికి సిలబస్‌ పూర్తిపై ఉపాధ్యాయుల మల్లగుల్లాలు

అక్టోబర్‌ తొలి వారంలో విధుల్లోకి డీఎస్సీ టీచర్లు

జిల్లాలో ఇదీ పరిస్థితి..

విద్యాశాఖ నిర్ణయాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ తరహాలో వీరు వ్యవహరిస్తారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. తాజాగా సిలబస్‌ను డిసెంబర్‌ ఐదు నాటికే పూర్తి చేయాలనే వీరి ఆదేశాలు ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు.. మూల్యాంకనం.. మార్కుల అప్‌లోడ్‌ ఇలా భారాలను భరిస్తున్న తరుణంలో ఇంత తక్కువ కాలంలో ఎలా కంప్లీట్‌ చేయాలోననే ఆందోళన వీరిలో నెలకొంటోంది. సమయం తక్కువగా ఉండటంతో అరకొరగా బోధించి ముగించే పనిలో ఉన్నారనే వాదనా లేకపోలేదు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాఠశాలలు – 724 పరీక్షలకు హాజరుకానున్న

విద్యార్థులు – 29,706 మంది

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు బోధన కంటే పరీక్షలు, మూల్యాంకనం, మార్కుల అప్‌లోడ్‌లోనే బిజీగా మారారు. ఎఫ్‌ఏ – 2 పరీక్షలు గత నెల్లో జరిగాయి. పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల బుక్‌లెట్లను ఆన్‌లైన్‌, హెడ్‌మాస్టర్‌ రిజిస్టర్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 11 నుంచి 25 వరకు జరిగింది. ఆ తర్వాత మోంథా తుఫాన్‌ కారణంగా పాఠశాలలకు వరుసగా నాలుగు రోజుల సెలవును ప్రకటించారు. నవంబర్‌కు సంబంధించిన సమ్మేటివ్‌ – 1 పరీక్షలు ఈ నెల పదిన ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన మూల్యాంకనం, మార్కుల నమోదుకు ఈ నెల 25 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాల క్రమంలో పిల్లలకు ఎప్పుడు బోధించాలని ఉపాధ్యాయులు ప్రశ్ని స్తున్నారు.

ముందే తెలియజేశాం

సిలబస్‌ను డిసెంబర్‌ ఐదు నాటికి పూర్తి చేయాలనే అంశాన్ని అందరికీ ముందే తెలియజేశాం. హెచ్‌ఎం, ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించిన ప్రతిసారీ ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులకు సిలబస్‌ అర్థం కాకపోతే రివిజన్‌లో సమయం ఉంటుంది. పరీక్షలు, మూల్యాంకనం, మార్కుల నమోదు తరచూ జరిగేవే. ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. – బాలాజీరావు, డీఈఓ

పరీక్షలు, మూల్యాంకనంతో బిజీ 1
1/1

పరీక్షలు, మూల్యాంకనంతో బిజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement