సీతారామరెడ్డి మృతి తీరని లోటు
బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): బుచ్చిరెడ్డిపాళెం కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేనకూరు సీతారామరెడ్డి మృతి చెందడం పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెంలోని పెద్దూరులో గల ఆయన నివాసానికి చేరుకొని పార్థీవదేహానికి శనివారం నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, పార్టీ కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


