ఆర్టీసీ డ్రైవర్‌పై మందుబాబుల దాడి
బుచ్చిరెడ్డిపాళెం (కోవూరు): కారును పక్కకు తీయాలంటూ హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్ మధుపై మద్యం మత్తులో ఉన్న ఆరుగురు యువకులు దాడికి పాల్పడిన ఘటన బుచ్చిరెడ్డిపాళెంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కారును రోడ్డు పక్కన నిలిపి డోర్లు తెరిచి ఆరుగురు యువకులు మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ స్లో చేసి హారన్ మోగించారు. దీంతో రెచ్చిపోయిన వారు బస్సును వెంబడించి కారును తెచ్చి అడ్డంగా పెట్టారు. బస్సులోకెక్కి డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని ప్రయాణికులు సైతం ఆందోళనకు గురయ్యారు. బస్సు దిగి కారులో చూడగా, బీరు బాటిళ్లు కనిపించాయి. అప్పటికే ప్రయాణికులు, స్థానికులు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేశారు. దుండగుల గుర్తింపునకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై మందుబాబుల దాడి


