వందల కిలోల గంజాయి ధ్వంసం
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శాసీ్త్రయ పద్ధతిలో ధ్వంసం చేశారు. వివరాలు.. 64 కేసుల్లో 751.586 కేజీల డ్రై గంజాయి, 950 గ్రాముల హాషిష్ ఆయిల్, 4.2 మీటర్ల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని శుక్రవారం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థలో శాసీ్త్రయంగా ధ్వంసం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం.శంకయ్య (డీసీ, నెల్లూరు), పి.దయాసాగర్ (ఏసీ, నెల్లూరు), కె.విజయ (డీసీ, ఒంగోలు), ఎ.శ్రీనివాసులు నాయుడు (డీపీఈఓ, నెల్లూరు), జె.రమేష్ (ఏఈఎస్, నెల్లూరు), నజీమా బేగం (పర్యావరణ ఇంజినీర్, ఏపీపీసీబీ), నెల్లూరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.


