చేనేత కార్మికులు, నేతల ధర్నా
చేనేత కార్మికులకు తుఫాను సాయం అందించడంలో అధికారులు కోతలు విధించడంపై శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. బీజేపీ నాయకుడు మిడతల రమేష్ మాట్లాడుతూ చేనేత అధికారిణి రజనీ విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే సర్వే సక్రమంగా చేపట్టలేదన్నారు. జిల్లా అధికారులు బాగా పనిచేస్తే నేతన్నలు రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉండదన్నారు. చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవరపు బా లాజీ మాట్లాడుతూ పొదలకూరు కాలనీలో 36 కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వర్షాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. అనంతరం తహసీల్దార్ బి.శివకృష్ణయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాలో చింతగింజల చినసుబ్ర హ్మణ్యం, పూల ప్రశాంత్, చొప్పా వెంకటేశ్వర్లు, రామసుబ్బయ్య, ధనుంజయరావు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.


