
8 ఏళ్లుగా అద్దె కట్టని దుకాణం సీజ్
నెల్లూరు(బారకాసు): సుబేదారుపేటలోని మున్సిపల్ ఎన్‌సీ బిల్డింగ్‌లో ఓ దుకాణానికి సంబంధించి యజమాని 8 ఏళ్లుగా అద్దె కట్టని కారణంగా రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఆ కాంప్లెక్స్‌లో షాప్ నంబర్ పదికి సంబంధించి అద్దెకు ఉంటున్న యజమాని 2017 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు బాడుగ రూ.17,84,754లు ఎన్‌ఎంసీకి కట్టలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సచివాలయ అడ్మిన్ దొరబాబుతోపాటు మున్సిపల్ సిబ్బంది సమక్షంలో దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ కిరణ్ మాట్లాడుతూ తాము అందజేసిన నోటీసుకు మూడు రోజుల్లోపు అద్దె బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, లేనిపక్షంలో చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.