
కాల్‌లెటర్ రాలేదు
నాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కేటగిరీలో 89వ ర్యాంక్ వచ్చింది. మెరిట్ లిస్టులో 8వ పేరు ఉంది. ఈ కేటగిరీకి సంబంధించి పురుషులు – 4, మహిళలు – 2 కలిపి 6 పోస్టులున్నాయి. అయితే నా కంటే ముందున్న ఇద్దరు అభ్యర్థులు పీజీటీ, టీజీటీ పోస్టులకు వెళ్లారు. ఆరుగురు అభ్యర్థులకు పోస్టులు రావాలి. అయితే నాకు ముందున్న ఐదుగురు అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపించారు. నాకు పంపించలేదు. రెండు రోజులుగా స ర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా.
– సీహెచ్ సుధీర్, కోవూరు
రెండురోజుల నుంచి
ఇక్కడే ఉన్నా
నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కేటగిరీలో 36వ ర్యాంక్ వచ్చింది. ఈ కేటగిరీలో 4 పోస్టులున్నాయి. ముగ్గురికి కాల్‌లెటర్లు పంపించారు. ఇంకా ఈ కేటగిరీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. మాది బీసీ డీ. ఇంకా కాల్‌లెటర్ అందలేదు. దాని కోసం రెండు రోజులుగా నెల్లూరులోనే ఉంటున్నా. జిల్లా అధికారులను అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని, లెటర్ వచ్చిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తామన్నారు.
– జి.చంద్రశేఖర్, సూళ్లూరుపేట

కాల్‌లెటర్ రాలేదు