
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● మంత్రి నారాయణ
నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు, నుడా, కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ నియోజకవర్గ ఆభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. కొత్త లేఅవుట్లలో పది శాతం స్థలం పార్క్, దేవాలయాలకు వదిలేయాలని చెప్పారు. అనంతరం సర్వేపల్లి, కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. సమీక్షలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆర్డీఓ అనూష, కమిషనర్ నందన్, కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.