
29న ఏటీఎస్ ప్రారంభం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ముత్తుకూరు మండలం కప్పలదొరువులో ఏర్పాటు చేస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను ఈ నెల 29న ప్రారంభించనున్నారు. ఈ ఏటీఎస్ కేంద్రాన్ని ప్రణీత్ ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం చేపడుతోంది. ఇది ప్రారంభమైతే జిల్లాలోని నెల్లూరుతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరు రవాణా కార్యాలయ పరిధిలోని అన్ని రవాణా వాహనాలకు ఇక్కడే ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రవాణా వాహనాలకు జిల్లా రవాణాశాఖాధికారులే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తున్నారు.
కానిస్టేబుళ్ల
సర్టిఫికెట్ల పరిశీలన
● 243 మందికి 235 మంది హాజరు
నెల్లూరు (క్రైమ్): ఏపీ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శనివారం స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. 243 మంది హాజరుకావాల్సి ఉండగా 235 మంది హాజరయ్యారు. ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. సివిల్‌లో 142 మందికి 137 మంది, ఏపీఎస్పీలో 101 మందికి 98 మంది హాజరయ్యారు. వారి విద్యార్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారు భవిష్యత్‌లో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏఓ చంద్రమౌళి, సూపరింటెండెంట్ సురేష్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్సీ మెరిట్
జాబితా విడుదల
నెల్లూరు (టౌన్): డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25న మద్రా సు బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఐపీఎస్ (వీఆర్ పీజీ కళాశాల)లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రారంభమవుతుందన్నారు. ఇతర వివరాల కోసం గిరీష్‌చంద్ర 7680009933, అజమ్‌తుల్లా 7075538818 నంబర్లలో సంప్రదించాలన్నారు.

29న ఏటీఎస్ ప్రారంభం