
డీఎస్సీలో మూడు పోస్టులకు అర్హత
ఉదయగిరి : డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఉదయగిరి మండలం సున్నంవారిచింతల గ్రామానికి చెందిన పులిమి శ్రీతేజ మూడు ఉద్యోగాలు సాధించింది. ఈమె ఎస్‌ఏ సోషల్ సబ్జెక్ట్‌లో జిల్లా స్థాయిలో 82.11 మార్కులు సాధించి 4వ ర్యాంక్‌లో, టీజీటీ జోనల్– 3 స్థాయిలో 73.20 మార్కులు సాధించి 17వ ర్యాంక్, ఎస్‌జీటీ చిత్తూరు జిల్లాలో నాన్ లోకల్‌లో 86.92 మార్కులతో 33వ ర్యాంక్ సాధించి తన ప్రతిభ చాటారు.
● ఉదయగిరికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు షేక్ నసృల్లా ఇంగ్లిష్ ఎస్‌ఏ సబ్జెక్ట్‌లో 57వ ర్యాంక్, షేక్ సిగ్భతుల్లా జోన్–3 పీఈటీ విభాగంలో 1వ ర్యాంక్, జనరల్ కేటగిరీలో 179వ ర్యాంకులు సాధించి ఉద్యోగం తెచ్చుకున్నారు.
బంగారు హారం బహూకరణ
సంగం: సంగం ఆంజనేయస్వామి ఆలయానికి ఓ దాత సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు హారాన్ని శనివారం బహూకరించారు. ముందుగా స్వామి వారికి విశేష పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారాన్ని సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

డీఎస్సీలో మూడు పోస్టులకు అర్హత