
ఒకే డీఎస్సీలో మూడు పోస్టులు
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంక్
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంక్
పొదలకూరు : మండలంలోని బి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన తిరుమూరు స్వప్న 2025 డీఎస్సీ పోటీ పరీక్షల్లో ఒకే పర్యాయం మూడు పోస్టులను సాధించి తన ప్రతిభను కనపరిచారు. స్కూల్ అసిస్టెంట్ హిందీలో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు, పీజీటీలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు, టీజీటీలో జిల్లా స్థాయిలో ఐదో ర్యాంకు సాధించారు. 2018లో డీఎస్సీలో అర్హత సాధించలేకపోయిన స్వప్న 2025 డీఎస్సీలో మూడు పోస్టులను సాధించడంతోపాటు ర్యాంకర్‌గా నిలిచారు. పట్టుదల, కృషితో ఆమె ఈ విజయాన్ని అందుకున్నారు.