
రైల్లోంచి జారిపడి..
● హెల్త్ అసిస్టెంట్ మృతి
కొడవలూరు: ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి హెల్త్ అసిస్టెంట్ మృతిచెందిన ఘటన మండలంలోని తలమంచి – కొడవలూరు రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. బోగోలు మండలం కోవూరుపల్లి పీహెచ్‌సీలో హెచ్‌ఏగా పనిచేసే ఎన్.రామ్‌కుమార్ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సమీపంలో నివాసముంటున్నాడు. రోజూ అక్కడి నుంచే విధులకు వస్తుంటాడు. సోమవారం కూడా రైల్లో బయలుదేరాడు. తలమంచి సమీపంలో 188 – 9 – 7 పోస్టుల మధ్య ఎగువలైన్‌లో రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
చెక్‌పోస్ట్ పాయింట్‌ను ఢీకొన్న లారీ
మర్రిపాడు: మండలంలోని జిల్లా సరిహద్దు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై సరిహద్దు వద్దనున్న చెక్‌పోస్ట్ పాయింట్‌ను లారీ ఢీకొనడంతో అది పూర్తిగా నేలమట్టమైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నంద్యాల నుంచి తడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రైల్లోంచి జారిపడి..