బంగారు దుకాణాల్లో డీఆర్‌ఐ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బంగారు దుకాణాల్లో డీఆర్‌ఐ తనిఖీలు

Jun 3 2025 12:10 AM | Updated on Jun 3 2025 12:10 AM

బంగారు దుకాణాల్లో డీఆర్‌ఐ తనిఖీలు

బంగారు దుకాణాల్లో డీఆర్‌ఐ తనిఖీలు

నెల్లూరు సిటీ: నెల్లూరులోని కాపువీధిలో ఉన్న బంగారు దుకాణాల్లో డీఆర్‌ఐ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. కొందరు బంగారం అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటకకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు నగరంలోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ రాష్ట్రంలో ఇటీవల పట్టుబడిన అక్రమ బంగారం విషయంలో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి పేరు ఉండటంతో విచారణ నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు తెలిసింది. కాగా అధికారులపై వ్యాపారులు తిరగబడ్డారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంతపేట పోలీసులకు అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో ఓ దుకాణ నిర్వాహకుడు భవిశ్‌జైన్‌ను విచారణ నిమిత్తం చిల్డ్రన్స్‌పార్కు సమీంపలోని డీఆర్‌ఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ దుకాణంలోని పలు రికార్డులు, హార్డ్‌ డిస్క్‌లు స్వాఽధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement