ఉగ్రదాడిపై కొవ్వొత్తులతో నిరసన
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌సీ సెంటర్‌లో పాకిస్తాన్ డౌన్‌డౌన్, టెర్రరిజం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఉగ్ర ఉన్మాదాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్‌చార్జి కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు జరపడం పిరికిపందల చర్య అన్నారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదన్నారు. నవవధూవరులని కూడా చూడకుండా భర్తను చంపడం కుటుంబంలో భర్తను చంపిన తర్వాత మమ్మల్ని కూడా చంపమని భార్య, పిల్లలు అడిగితే వెళ్లి మోదీకి చెప్పుకోమనడం అమానీయం అన్నారు. దేశం మొత్తం ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మందల వెంకట శేషయ్య, రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ హంజా హుస్సేనీ, రాష్ట్ర మేధావుల పోరం అధికార ప్రతినిధి సమీర్‌ఖాన్, యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ సిద్ధిక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి , కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, మొయిళ్ల గౌరి, వేలూరు మహేష్, గుంజి జయలక్ష్మి, కరిముల్లా, కామాక్షి దేవి, నాయకులు మహమ్మద్ రవూఫ్, నేతాజీ సుబ్బారెడ్డి, పిచ్చిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మున్వర్, నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


