జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
● ప్రత్యేకాధికారి డాక్టర్ ఎన్ యువరాజ్
నెల్లూరు రూరల్: వినూత్న ఆలోచనలు, టీం వర్క్‌తో జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎన్ యువరాజ్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు నియమించిన జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమ లు, వాణిజ్యశాఖల కార్యదర్శి యువరాజ్ శుక్రవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఓ ఆనంద్ వివిధ రంగాల్లో జిల్లా పురోగతిని వివరించా రు. ప్రత్యేక అధికారి యువరాజ్ మాట్లాడుతూ జిల్లా లో వనరులను, ప్రజావసరాలను గుర్తించి అన్ని స్థాయిల్లో డేటాను అనుసంధానం చేసి అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం దొరు కుతుందన్నారు. కింది స్థాయిలో అధికారులు చేసిన ప్రయోగాల ద్వారా మాత్రమే ఉన్నతంగా తీర్చదిద్దుతాయన్నారు. జిల్లాలోని అధికారులతో స్ట్రాటజిక్ కోర్ గ్రూప్‌ను తయారు చేసి ప్రజావసరాలను తెలుసుకుని, అందుబాటులో ఉన్న వనరులతో జిల్లాను అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. టూరిజం పరంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజీ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. నేటి యవత ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న దృష్ట్యా అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఎంటర్ ప్రెన్యూర్‌గా మారేందుకు తోడ్పాటు అందించాలన్నారు. జిల్లా జీడీపీ పెరిగేందుకు సర్వీస్ సెక్టార్‌లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర రంగాల్లో వృద్ధి సాధించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తూ, వెనుకబడిన వాటిని ప్రోత్సహించాలన్నారు. టిడ్కో గృహాల్లో ఎక్కువ మంది చేరే విధంగా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మహిళలు రోటిన్‌గా చేసే ఉత్పత్తులు కాకుండా కొత్త ఉత్పత్తులపై దృష్టి పెట్టే విధంగా మెప్మా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ కె కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, పావని, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


