నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రపంచ కప్‌లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్స్‌ను వీక్షించేందుకు వీలుగా జిల్లా కేంద్రాల్లో బిగ్ స్క్రీన్లను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. అభిమానులు ఉచితంగా వీక్షించొచ్చని, అక్కడ ఫుడ్ కౌంటర్లను సైతం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పెద్ద స్క్రీన్ల ఏర్పాటు విషయమై కోరిన వెంటనే అనుమతులిచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. నగరంలోని వీఆర్ హైస్కూల్ మైదానంలో బిగ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నామని, అభిమానులు తరలిరావాలని కోరారు.