అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Mar 30 2023 12:32 AM | Updated on Mar 30 2023 12:32 AM

మృతుడు బద్వేలు వాసి

మర్రిపాడు : మండలంలోని సింగనపల్లి అటవీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. స్థానికుల సమాచారంతో తొలుత అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై విశ్వనాథరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం ఫొటోలను వైఎస్సార్‌, నెల్లూరు జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు పంపారు. కాగా బద్వేల్‌ పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు నమోదైనట్లు గుర్తించారు. సదరు కుటుంబీకులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం తమ వారిదేనని నిర్ధారించారు. దీంతో మృతుడు వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ మండలం నందిపల్లి గ్రామానికి చెందిన మన్నెం బలరామిరెడ్డి (73)గా గుర్తించారు. ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంచొచ్చని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలంలో విషపు గూళికలు కూడా ఉండడంతో వాటిని తిని మృతిచెంది ఉండొచ్చని పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిపాడు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement