చేనేత రంగాన్ని కేంద్రం ఎలా ప్రోత్సహిస్తోంది?

- - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌) : ఏపీలో చేనేత అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా ప్రోత్సాహం అందిస్తోందని లోక్‌సభలో ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్‌ సమాధానమిస్తూ విశాఖపట్నంలో వెయ్యి కుట్టు యంత్రాలతో టెక్స్‌టైల్‌ పార్క్‌ నడుస్తోందని, ఏపీలో 1.78 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆధారపడి ఉన్నారని సమాధానమిచ్చారు. ఉక్కు పరిశ్రమల ఏర్పాటులో చిన్న పరిశ్రమలకు అవకాశం ఉందా అని ఆదాల మరో ప్రశ్న వేశారు. స్పందించిన సంబంధిత మంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారితో పాటు ఉక్కు తయారీదారులతో ప్రభుత్వం విస్తృతమైన సంప్రదింపులు జరిపిందని తెలిపారు.

ఉపాధి హామీ సమస్యలపై చర్యలేవి?
నెల్లూరు(సెంట్రల్‌) :
ఉపాధి హామీ పథకం కార్మికులు ఢిల్లీలో ధర్నా చేయడం వాస్తవమేనా, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని రాజ్యసభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు కొన్ని సవరణలు చేశామని, వీటితో పాటు ఫొటో అప్‌లోడ్‌కు సంబంధించి కొన్ని సమరణ చేశామని సమాధానమిచ్చారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top