ముగిసిన ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

Mar 30 2023 12:30 AM | Updated on Mar 30 2023 12:30 AM

నెల్లూరులో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు - Sakshi

నెల్లూరులో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. కాగా వచ్చేనెల 4వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతాయి. ఈనెల 15 ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 55,909 మంది విద్యార్థులు హాజరయ్యారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 12 మందిని అధికారులు డిబార్‌ చేశారు. చివరిరోజు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పలు పరీక్షలను నిర్వహించారు. జనరల్‌కు సంబంధించి 24,785 మందికి గానూ 24,171 మంది హాజరయ్యారు. 614 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 621 మందికి గానూ 569 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌ ఎగ్జామ్స్‌ ముగియడంతో జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఏపీ ఎంసెట్‌, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పలు పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కానున్నారు. కొంతమంది ఇళ్లకు పయనమయ్యారు. ఇంటి దగ్గరే చదివి పరీక్షకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నగదు పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు, వారి కోచ్‌లకు భారత ప్రభుత్వం అందించే నగదు పురస్కారాన్ని పొందేందుకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సెట్నల్‌ సీఈఓ పుల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరం ఆగస్ట్‌ 11వ తేదీకి ముందు జరిగిన అర్హత గల క్రీడాంశాలకు సంబంధించి నగదు అందని వారికి అందించేందుకు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. దరఖాస్తులను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ యొక్క డీబీటీ – ఎంఐఎస్‌ పోర్టల్లో https:// dbtyas–sports.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement