
ఉలవపాడు: మండల కేంద్రమైన ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన మూడో రైల్వే ట్రాక్‌ను సెంట్రల్ రైల్వే భద్రతా అధికారి ప్రాన్‌జీవ్ సక్సేనా, దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం శివేంద్రమోహన్ మంగళవారం ప్రారంభించారు. నాణ్యత, భద్రతా ప్రమాణాలతో మూడో లైన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 4వ నంబర్ ప్లాట్‌ఫాం మీదుగా ఉలవపాడులో ఈ లైన్ వెళుతుంది. జెండా ఊపి రైలును ఈ లైన్‌పై నడిపి ప్రారంభించారు. అనంతరం ఉలవపాడులోని ప్రజా సంఘాల నాయకులు పలు సమస్యలను వారికి తెలియజేశారు. ఉలవపాడు మామిడి, సపోట వ్యాపారాలకు కేంద్రం అయినందున ఎక్స్‌ప్రెస్‌లు నిలపాలని కోరారు. రామాయపట్నంలో ఓడరేవు కూడా నిర్మిస్తున్న నేపథ్యంలో అదనపు రైళ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.