సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా | World Championship Of Legends 2024: Pakistan To Take On West Indies, India To Take On Australia In Semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా

Jul 11 2024 3:54 PM | Updated on Jul 11 2024 4:08 PM

World Championship Of Legends 2024: Pakistan To Take On West Indies, India To Take On Australia In Semis

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌, వెస్టిండీస్‌.. రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ రెండు మ్యాచ్‌లు రేపు నార్తంప్టన్‌ వేదికగా జరుగనున్నాయి. భారతకాలమానం ప్రకారం తొలి సెమీస్‌ సాయంత్రం 5 గంటలకు.. రెండో సెమీస్‌ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.

కాగా, దిగ్గజ క్రికెటర్లతో కూడిన ఆరు దేశాలు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో పాల్గొన్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, భారత్‌ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ ఇంటిబాట పట్టాయి. నిన్న సౌతాఫ్రికా ఛాంపియన్స్‌, భారత ఛాంపియన్స్‌ మ్యాచ్‌తో తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓడినా సెమీస్‌కు చేరింది (మెరుగైన రన్‌రేట్‌ కారణంగా).

దీనికి ముందు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా రికార్డు స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో  ఆసీస్‌ 20 ఓవర్లలో 274 పరుగులు చేయగా.. విండీస్‌ సైతం గట్టిగానే పోరాడి 219 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్‌ ఇంటిబాట పట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement