
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా (Team India) సామర్థ్యం మేరకు రాణించలేకపోయింది.
కొలొంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి పాక్ (Pakistan) ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 247 పరుగులకు ఆలౌటైంది.
46 పరుగులతో హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ 35 (నాటౌట్), జెమీమా రోడ్రిగెజ్ 32, ప్రతీక రావల్ 31, దీప్తి శర్మ 25, స్మృతి మంధన 23, స్నేహ్ రాణా 20, హర్మన్‌ప్రీత్ 19, శ్రీ చరణి 1, క్రాంతి గౌడ్ 8, రేణుకా సింగ్ డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా పెద్దగా స్కోర్లుగా మలచలేకపోయారు.
పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సదియా ఇక్బాల్, కెప్టెన్ ఫాతిమా సనా తలో 2, రమీన్ షమీమ్, సష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.
స్ప్రే ఉపయోగించిన పాక్ కెప్టెన్
భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నచిన్న పురుగులు పలు మార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాయి. ఓ దశలో పరుగుల సమస్య ఎక్కువ కావడంతో అంపైర్ అనుమతితో పాక్ కెప్టెన్ పరుగుల నివారణ స్ప్రేను ప్రయోగించింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో ఇది జరిగింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత పురుగుల ప్రభావం తగ్గడంతో భారత బ్యాటింగ్ సజావుగా సాగింది.
టాస్ సమయంలో గందరగోళం
టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచినట్లు రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ ప్రకటించారు. వాస్తవానికి పాక్ కెప్టెన్ టాస్ గెలవలేదు.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ వేయగానే ఫాతిమా "టెయిల్స్" అని చెప్పింది. కానీ రిఫరీ ఫ్రిట్జ్, అనౌన్సర్ మెల్ జోన్స్ "హెడ్స్"గా వినిపించుకున్నారు.
తీరా నాణెం "హెడ్స్"గా పడడంతో టాస్ పాకిస్తాన్ గెలిచిందని ప్రకటించారు. టాస్ గెలిచిన ఫాతిమా ఫీల్డింగ్ ఎంచుకోగా, దీనిపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరం.
చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్