మెయిన్‌ ‘డ్రా’కు గెలుపు దూరంలో...   | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు గెలుపు దూరంలో...  

Published Wed, Mar 6 2024 4:23 AM

A win away from the main draw - Sakshi

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ మెయిన్‌ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. కాలిఫోర్నీయాలో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌  మ్యాచ్‌లో ప్రపంచ 101వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–2, 6–2తో ప్రపంచ 580వ ర్యాంకర్‌ స్టెఫాన్‌ డొస్టానిక్‌ (అమెరికా)పై గెలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌లో కొరియా ప్లేయర్‌ సియోంగ్‌చన్‌ హాంగ్‌తో సుమిత్‌ తలపడతాడు.   

Advertisement
 
Advertisement
 
Advertisement