
బీల్ (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది డేవిస్‌కప్ క్వాలిఫయర్స్‌లో చోటు కోసం భారత పురుషుల టెన్నిస్ జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు స్విట్జర్లాండ్ జట్టుతో వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్‌లో భారత్ ఆడనుంది. ముఖాముఖి పోరులో భారత్ 2–1తో స్విట్జర్లాండ్‌పై ఆధిక్యంలో ఉంది.
భారత్ తరఫున సింగిల్స్‌లో సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్, డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జోడీ బరిలోకి దిగనుంది. నేడు జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో జెరోమ్ కిమ్‌తో దక్షిణేశ్వర్ సురేశ్; మార్క్ ఆండ్రియా హుస్లెర్‌తో సుమిత్ నగాల్ తలపడతారు.
శనివారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్‌లో జాకబ్ పాల్–డొమినిక్ స్ట్రికర్ జంటతో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పోటీపడుతుంది. అనంతరం జెరోమ్ కిమ్‌తో నగాల్; హుస్లెర్‌తో సురేశ్ ఆడతారు. గురువారం ‘డ్రా’ కార్యక్రమం కంటే ముందు భారత టెన్నిస్ జట్టుకు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సన్మానించారు.