
వెస్టిండీస్‌దే టెస్టు సిరీస్(PC: WC)
WI Vs Eng Test Series: మీడియం పేసర్ కైల్ మేయర్స్ (5/18) చెలరేగడంతో... ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో ఆతిథ్య జట్టు సొంతం చేసుకుంది. మేయర్స్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 64.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది.
ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 28 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ క్రమంలో 2019 తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను దక్కించుకుంది. ఇక వంద పరుగులతో అజేయంగా నిలిచిన జాషువా డ సిల్వా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
#MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6
— Windies Cricket (@windiescricket) March 27, 2022
ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా అత్యంత చిరాకు తెప్పించిన టెస్టు మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మేము అద్భుతంగా ఆడాం. అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది చాలా చాలా విసుగు తెప్పించిన మ్యాచ్. ముఖ్యమైన సమయంలో సరిగ్గా రాణించలేకపోయాం. అయితే, కచ్చితంగా ఈ మ్యాచ్‌లో క్రెడిట్ వెస్టిండీస్‌కు ఇవ్వాల్సిందే. వాళ్లు బాగా ఆడారు. ఏదేమైనా మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 204
రెండో ఇన్నింగ్స్- 120
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్- 297
రెండో ఇన్నింగ్స్- 28/0
చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!