ఓవైపు గాయం.. అయినా 'గ‌బ్బ‌ర్' వీరోచిత సెంచరీ(వీడియో) | When Shikhar Dhawan smashed 117 against Australia with a fractured thumb in 2019 ODI World Cup | Sakshi
Sakshi News home page

#Shikhar Dhawan: ఓవైపు గాయం.. అయినా 'గ‌బ్బ‌ర్' వీరోచిత సెంచరీ(వీడియో)

Aug 24 2024 1:53 PM | Updated on Aug 24 2024 3:37 PM

When Shikhar Dhawan smashed 117 against Australia with a fractured thumb in 2019 ODI World Cup

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న 14 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు ముగింపు ప‌లికాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌కు కూడా గ‌బ్బ‌ర్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధావ‌న్‌.. చివ‌ర‌గా డిసెంబర్ 2022లో భార‌త జెర్సీలో క‌న్పించాడు. 

యువ క్రికెట‌ర్ల రాక‌తో పాటు ఫామ్ లేమి కార‌ణంగా గ‌బ్బ‌ర్ భార‌త జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అయితే గ‌త రెండేళ్ల‌గా టీమిండియాలో ధావ‌న్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌ట‌కి.. ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. భార‌త జ‌ట్టుకు ఎన్నో చారిత్ర‌త్మ‌క విజ‌యాల‌ను సైతం శిఖ‌ర్ అందించాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2019లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ ధావ‌న్ కెరీర్‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలిపోతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఓ వైపు గాయంతో బాధ‌ప‌డుతూనే ధావ‌న్ మెరుపు సెంచ‌రీతో చెల‌రేగాడు. అది కూడా త‌న పుట్టిన రోజున కావ‌డం విశేషం.

పోరాట యోదుడు..
2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా లీగ్ మ్యాచ్‌లో డిసెంబ‌ర్ 5న ఆస్ట్రేలియాతో టీమిండియా త‌ల‌ప‌డింది.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ స్టార్ పేస‌ర్  ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతి శిఖర్ ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. దీంతో అత‌డు నొప్పితో విల్ల‌విల్లాడు.

ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌ట‌కి నొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. దీంతో అత‌డి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతాడ‌ని అంతా భావించారు. కానీ ధావ‌న్ మాత్రం త‌న ఆట‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

ఓ వైపు గాయంతో బాధ‌పడుతూనే ఆసీస్ బౌల‌ర్ల‌పై గ‌బ్బ‌ర్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్ర‌మంలో నొప్పిని భరిస్తూనే అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత వేగంగా సెంచ‌రీ సాధించిన తొలి ఆసియా ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. 

ఓవ‌రాల్‌గా ఆ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న ధావ‌న్‌.. 16 ప‌రుగుల‌తో 117 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇక మ్యాచ్ అనంత‌రం ధావ‌న్‌ను స్కానింగ్‌కు త‌ర‌లించ‌గా.. బొట‌న వేలు విరిగిన‌ట్లు తేలింది. దీంతో టోర్నీ మ‌ధ్య‌లోనే గ‌బ్బ‌ర్ వైదొల‌గాడు. అత‌డి స్ధానాన్ని రిష‌బ్ పంత్‌తో బీసీసీఐ భ‌ర్తీ చేసింది. 

అయితే 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓట‌మి పాలైంది. కాగా ధావ‌న్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ అత‌డి ఐకానిక్ ఇన్నింగ్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement