‘ఫీమేల్‌ యాక్టర్లకు..‍ క్రికెటర్లు మెసేజ్‌ చేస్తే తప్పేంటి?’ | Whats Wrong: Shadab Khan On Pak Cricketers Messaging Female Actors Remark | Sakshi
Sakshi News home page

ఫీమేల్‌ యాక్టర్లకు మెసేజ్‌ చేస్తే తప్పేంటి?: పాక్‌ క్రికెటర్‌

Jan 29 2025 5:07 PM | Updated on Jan 29 2025 5:29 PM

Whats Wrong: Shadab Khan On Pak Cricketers Messaging Female Actors Remark

పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌(Shadab Khan)కు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహిళా అభిమాని నుంచి విచిత్ర ప్రశ్న ఎదురైంది. పాక్‌ క్రికెటర్లంతా నటీమణులకు పదే పదే ఫోన్‌లో సందేశాలు ఎందుకు పంపిస్తారని ఆమె అడిగింది. ఇందుకు షాదాబ్‌ ఇచ్చిన సమాధానం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా గతంలో పలువురు నటీమణులు తమకు పాక్‌ క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో టిక్‌టాకర్‌ షాతాజ్‌ ఖాన్‌(Shahtaj Khan).. షాదాబ్‌ ఖాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు తనతో వాట్సాప్‌లో కాంటాక్టులో ఉన్నాడని.. తనను పెళ్లి చేసుకోమంటూ ప్రతిపాదన(Marriage Proposal) కూడా తెచ్చాడని చెప్పింది.

ఈ విషయం గురించి తాజాగా షాదాబ్‌ ఖాన్‌ స్పందించాడు. జియో న్యూస్‌ ‘షో’కు హాజరైన అతడు అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్‌.. ‘‘చాలా మంది ఫీమేల్‌ యాక్టర్లు తమకు క్రికెటర్లు సోషల్‌ మీడియాలో సందేశాలు పంపుతున్నారని చెప్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారా?.. ఎవరికైనా ఎప్పుడైనా మీరు అలా మెసేజ్‌ చేశారా?’’ అని ప్రశ్నించింది.

అందులో తప్పేముంది?
ఇందుకు షాదాబ్‌ ఖాన్‌ బదులిస్తూ.. ‘‘ఒకవేళ క్రికెటర్లు వాళ్లకు మెసేజ్‌లు పంపినా.. అందులో తప్పేముంది?.. క్రికెటర్లు నిజంగానే ఓ నటికి మెసేజ్‌ పంపించారే అనుకోండి. వాళ్లకు అది నచ్చకపోతే బదులివ్వకుంటే సరిపోతుంది కదా!

అలా చేస్తే ఇంకోసారి ఎవరూ మెసేజ్‌ చేసే సాహసం చేయరు. ఒకవేళ అలా కాకుండా.. వాళ్లు మెసేజ్‌లకు రెస్పాండ్‌ అవుతున్నారు అంటే.. వారికి కూడా ఎదుటి వ్యక్తి పట్ల ఆసక్తి ఉన్నట్లే అనుకోవాలా?..

కొంతమంది నటీమణులు ఈ విషయం గురించి ఇటీవల చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి వీడియోలు చూశాను. కానీ అందులో వారు చెప్పే ప్రతీ విషయం నిజం కావాలని లేదు. కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి.. అతిశయోక్తులతో వర్ణిస్తారు.

ఫేమస్‌ అవ్వాలనే ఉద్దేశంతో
అయితే, ఇలాంటి వాటి వల్ల జట్టుపై పెద్దగా ప్రభావం పడదు. కానీ టీమ్‌లోని ఏ సభ్యుడు మెసేజ్‌ పంపించాడన్న విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. కొంతమంది యాక్టర్లు తాము ఫేమస్‌ అవ్వాలనే ఉద్దేశంతో టైమ్‌ చూసి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నపుడు వీటి గురించి మాట్లాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’’ అని షాదాబ్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా పాకిస్తాన్‌ తరఫున 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు షాదాబ్‌ ఖాన్‌. అతడు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, 70 వన్డేలు, 104 అంతర్జాతీయ టీ20లు ఆడిన 26 ఏళ్ల షాదాబ్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 300, 855, 679 పరుగులు చేశాడు. 

అదే విధంగా.. టెస్టుల్లో 14, వన్డేల్లో 85, టీ20లలో 107 వికెట్లు తీశాడు. చివరగా 2023, నవంబరులో ఇంట్లండ్‌తో వన్డే సందర్భంగా పాకిస్తాన్‌కు చివరగా ప్రాతినిథ్యం వహించాడు.

ఇక షాదాబ్‌ ఖాన్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... దిగ్గజ స్పిన్నర్‌, తన కోచ్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ అలీ కుమార్తె మలైకాను అతడు వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల నడుమ 2023లో వీరి షాదాబ్‌- మలైకాల పెళ్లి జరిగింది.

చదవండి: Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి..

Advertisement
 
Advertisement
Advertisement