టీమిండియాతో ఓటమి.. వెస్టిండీస్‌కు మరో భారీ షాక్‌!

West Indies Fined for Slow Over Rate against India - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌  ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే వెస్టిండీస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్‌ స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసింది. ఈ కారణంతో విండీస్‌ జట్టుకు  40 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి వెస్టిండీస్‌ రెండు ఓవర్లు వెనుకబడింది.

ఆర్టికల్‌ 2.22 ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం..  నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైతే ఆటగాళ్లకు, జట్టు సహాయకి సిబ్బందికి ప్రతి ఓవర్‌కు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. అయితే విండీస్‌ జట్టు 2 ఓవర్లు వెనుకబడింది కనుక 40 శాతం జరిమానా విధించారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. విండీస్‌పై 155 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.  ఈ విజయంలో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించారు.

చదవండి: Women’s World Cup 2022: క్రీడా స్ఫూర్తి చాటుకున్న మంధాన.. తనకు దక్కిన అవార్డును!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top