హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్‌ సంపత్‌ | VS Sampath as HCA election officer | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్‌ సంపత్‌

Aug 8 2023 4:00 AM | Updated on Aug 8 2023 4:00 AM

VS Sampath as HCA election officer - Sakshi

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడింది. భారత ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌గా పని చేసిన వీరవల్లి సుందరం (వీఎస్‌) సంపత్‌ హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ (రిటైర్డ్‌) లావు నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీఎస్‌ సంపత్‌ నేతృత్వంలోనే జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement