Virat Kohli- Anushka Sharma: అంతులేని ప్రయాణం.. అనుష్కపై ప్రేమ కురిపించిన కోహ్లి! ఫొటో వైరల్

Virat Kohli- Anushka Sharma Virat Kohli- Anushka Sharma Wedding Anniversary: ‘‘అంతులేని ప్రయాణంలో ఐదేళ్ల కాలం... నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. మా మనసంతా నువ్వే. నీపై నా ప్రేమ అజరామరం’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. జీవితంలో తనకు దక్కిన గొప్ప బహుమతిగా అనుష్కను అభివర్ణించాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లిరోజు నేడు(డిసెంబరు 11). ఆదివారంతో ఈ జంట వివాహ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సతీమణికి విషెస్ చెబుతూ కోహ్లి ఇన్‌స్టాలో తమ ఇద్దరి ఫొటోను పంచుకున్నాడు.
కోహ్లి- అనుష్కలకు శుభాకాంక్షల వెల్లువ
ఈ నేపథ్యంలో విరుష్క జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్టార్ జోడీకి సంబంధించిన ఫొటోలు పంచుకుంటూ మీ జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక అనుష్క సైతం భర్త కోహ్లితో ఉన్న ఫొటోలు పంచుకుంటూ తనదైన శైలిలో విషెస్ తెలియజేశారు. ఇందుకు కోహ్లి స్పందిస్తూ.. మై లవ్ అంటూ బదులిచ్చాడు. ఈ క్రమంలో విరుష్క(#virushka)జంట పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అలా మొదలైంది!
కాగా 2013లో ఓ యాడ్‌లో విరాట్ కోహ్లి- అనుష్క శర్మ కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడ్డ విరుష్క జోడీ 2017 డిసెంబరు 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. ఈ జంటకు కుమార్తె వామిక సంతానం. కెరీర్ విషయానికొస్తే భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న కోహ్లి ప్రస్తుతం బంగ్లాదేశ్ టూర్లో ఉండగా.. అనుష్క శర్మ చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమాతో బిజీగా ఉన్నారు.
విరుష్క లవ్‌స్టోరీ కోసం క్లిక్ చేయండి: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా!
Virat Kohli: పాంటింగ్‌ను దాటేసిన కోహ్లి..
Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే!
సంబంధిత వార్తలు