Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పోస్ట్‌ వైరల్‌! ఇంతకీ ఆమె ఎవరంటే!

Ind Vs Ban 3rd ODI: Ishan Kishan Girlfriend Aditi Hundia Post Viral - Sakshi

Bangladesh vs India, 3rd ODI- Ishan Kishan: జార్ఖండ్‌ యంగ్‌ డైనమైట్‌, టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. కెరీర్‌లో తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ యువ వికెట్‌ కీపర్‌ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీంతో ఇషాన్‌ పేరుతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది.

అద్భుతమైన ఇన్నింగ్స్‌... నిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కొనియాడగా.. టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ఆటగాడే కదా అని వీరేంద్ర సెహ్వాగ్‌ మెచ్చుకున్నాడు. ఇక స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ఇషూ నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు. 

ఇషూ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మరో స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి సైతం సూపర్‌ ఇన్నింగ్స్‌ అంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఇషాన్‌ కిషన్‌కు ఓ స్పెషల్‌ పర్సన్‌ నుంచి అందిన విషెస్‌ నెట్టింట చర్చకు దారితీశాయి. ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఎవరీ అదితి?!
ఆమె పేరు అదితి హుండియా. ఇషాన్‌ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉంది. మిస్‌ ఇండియా ఫైనలిస్టు అయిన అదితి.. మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ ఇద్దరు పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి.

అయితే, ఇషాన్‌ గానీ, అదితి గానీ తమ బంధం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్‌ ద్విశతకం బాదడంతో అదితి అతడిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

ఇషాన్‌ను ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్‌ హార్ట్‌ ఎమోజీతో ప్రేమను చాటుకుంది. అతడి స్పెషల్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన పోస్టును కూడా రీషేర్‌ చేసింది. దీంతో ఇషాన్‌- అదితి పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ఇషాన్‌ కిషన్‌ రికార్డులు... 
►వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ (126 బంతులు; పాత రికార్డు క్రిస్‌ గేల్‌ (138 బంతులు; 2015లో జింబాబ్వేపై)
►చిన్న వయసులో ద్విశతకం (24 ఏళ్ల 145 రోజులు; పాత రికార్డు రోహిత్‌ శర్మ (26 ఏళ్ల 186 రోజలు; 2013లో ఆస్ట్రేలియాపై), భారత్‌ తరఫున అతి తక్కువ (103) బంతుల్లో 150 పరుగుల మార్క్‌ (పాత రికార్డు సెహ్వాగ్‌ 112 బంతుల్లో; 2011లో వెస్టిండీస్‌పై)
►ఇక వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌. ఇంతకు ముందు రోహిత్‌ శర్మ మూడు సార్లు ద్విశతకం బాదగా.. సచిన్‌, సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌, ఫఖర్‌ జమాన్‌ ఈ ఘనత సాధించారు.

చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే
AUS vs WI: 77 పరుగులకే కుప్పకూలిన విండీస్‌.. 419 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top