Virat Kohli Surpasses Sachin Tendulkar, Has Most Fifty Plus Scores in ICC Events - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా

Oct 24 2022 8:57 AM | Updated on Oct 24 2022 10:13 AM

Virat Kohli surpasses Sachin Tendulkar, has most fifty plus scores in ICC events - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో దాయాదుల పోరు అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. సూపర్‌-12లో భాగంగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లి ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి (14 సార్లు) గుర్తింపు పొందాడు. మొహమ్మద్‌ నబీ (అఫ్గానిస్తాన్‌–13 సార్లు)ని కోహ్లి రెండో స్థానానికి పంపించాడు.

టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి (6 సార్లు) నిలిచాడు. గేల్‌ (వెస్టిండీస్‌; 5 సార్లు) రికార్డును కోహ్లి అధిగమించాడు. 

► టి20 మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన క్రికెటర్‌గా షోయబ్‌ మాలిక్‌  (పాకిస్తాన్‌; 18 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (18 సార్లు) సమం చేశాడు.

పాక్‌పై ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి (110 మ్యాచ్‌ల్లో 3,794) మళ్లీ టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ (143 మ్యాచ్‌ల్లో 3,741     పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు.

అదే విధంగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్‌ పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌లో కోహ్లికి ఇది 24 వ ఫిప్టీ ప్లస్‌ స్కోర్‌ . అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(23) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్‌ రికార్డును విరాట్‌ బ్రేక్‌ చేశాడు.
చదవండిT20 WC PAK Vs IND: మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు..! కానీ క్రెడిట్‌ విరాట్‌కే ఇవ్వాలి

Advertisement
 
Advertisement
Advertisement