SA vs IND: అయ్యో కోహ్లి... నీ కంటే ఉమేశ్‌ యాదవ్‌ ముందున్నాడు.. పర్లేదులే!

Virat Kohli Pulls Kagiso Rabadas Bouncer To Collect Rare Six Cape Town Test - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాప్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 79 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేయగల్గింది. కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు,1 సిక్స్‌ ఉంది. ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ వేసిన రబడా బౌలింగ్‌లో.. బౌన్సర్‌ని సిక్స్‌గా కోహ్లి మలిచాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒకే సిక్స్‌ నమోదైంది. అది కూడా కోహ్లిదే కావడం విశేషం. కాగా ప్రముఖ గణాంకవేత్త మోహన్‌దాస్ మీనన్ నివేదిక ప్రకారం.. 2019 నుంచి టెస్టు క్రికెట్‌లో కోహ్లికి ఇది ఐదవ సిక్స్ కావడం ​ గమనార్హం.

ఇదే సమయంలో రోహిత్‌ శర్మ(31), మయాంక్‌(25),పంత్‌(18) సిక్స్‌లతో కోహ్లి కన్నా ముందు వరుసలో ఉన్నారు. అంతే కాకుండా టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 11 సిక్స్‌లతో కోహ్లి కన్న ముందుంజలో ఉండడం​ గమనార్హం. ఇది ఇలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒంటరి పోరాటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి దక్షిణాప్రికా 17 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఎల్గర్‌ను ఆదిలోనే బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో మార్క్రమ్‌(8), కేశవ్‌ మహారాజ్‌(6) ఉన్నారు.

చదవండి: SA vs IND: జస్‌ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్‌ కెప్టెన్‌.. వీడియో వైరల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top