Virat Kohli Requesting Photographer to Not Click Their Daughter Vamika - Sakshi
Sakshi News home page

Virat Kohli- Vamika: మీడియా కంటపడ్డ వామిక.. పాప ఫొటోలు తీయవద్దంటూ కోహ్లి సీరియస్‌!

Dec 17 2021 10:11 AM | Updated on Dec 18 2021 8:06 AM

Virat Kohli To Photographers Baby Ka Photo Mat Lena As Leaves For South Africa With Vamika - Sakshi

PC: Social Media

ఎట్టకేలకు మీడియా కంటపడ్డ వామిక.. పాప ఫొటోలు తీయవద్దంటూ కోహ్లి సీరియస్‌!

Vamika Kohli: టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గారాల పట్టి వామికా కోహ్లి రూపం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాప మొదటి పుట్టినరోజైనా ఆమెను తమకు చూపించండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మీడియాకు ఆమెను దూరంగా ఉంచాలనుకున్న విరుష్క దంపతులు ఆమె ఫొటోను బయటకు రానివ్వడం లేదు. కానీ, పాపరాజీలు మాత్రం ఈ జంట ఎక్కడికి వెళ్తే అక్కడ పాపాయి ఫొటోను క్లిక్‌మనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

ఈ క్రమంలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతున్న సమయంలో మరోసారి ఇలాగే చేశారు. దీంతో రంగంలోకి దిగిన కోహ్లి.. ‘‘దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి’’ అని మర్యాదపూర్వకంగానే స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరోవైపు.. కోహ్లి హెచ్చరించే సమయానికే ఫొటోగ్రాఫర్లు.. వామిక ఫొటో క్లిక్‌మనిపించారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అందులో ఉన్నది వామికేనా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.


Social Media: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో

కాగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో కుటుంబాలతో కలిసి సౌతాఫ్రికా వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించలేదని సమాచారం. అయితే, తన ముద్దుల తనయ మొదటి పుట్టినరోజున భార్యాపిల్లలతో కలిసి సమయం గడపాలని భావించిన కోహ్లి.. ప్రత్యేక అనుమతితో వాళ్లిద్దరినీ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీ20 కెప్టెన్సీని వదిలేసిన కోహ్లిని.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో కేవలం టెస్టు కెప్టెన్సీకే అతడు పరిమితమయ్యాడు. ఇక కోహ్లి నేతృత్వంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు ఈసారి ఎలాగైన ట్రోఫీ గెలిచి సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 

చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement