Virat Kohli: పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే

Virat Kohli 104 Catches-2nd-Most Catches in IPL History Non-WicketKeepers - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ తన మార్క్‌ చూపిస్తున్నాడు. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్‌ క్యాచ్‌ అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా(నాన్‌-వికెట్‌కీపర్‌) కోహ్లి రెండోస్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో కీరన్‌ పొలార్డ్‌ 103 క్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. ప్రస్తుతం కోహ్లి 104 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. 109 క్యాచ్‌లతో సురేశ్‌ రైనా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘోర ప్రదర్శన చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 59 పరుగులకే కుప్పకూలింది. వేన్‌ పార్నెల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కర్ణ్‌ శర్మ, బ్రాస్‌వెల్‌ తలా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌లు చెరొక వికెట్‌ తీశారు.

ఈ క్రమంలో రాజస్తాన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌లు చెలరేగి ఆడడంతో భారీ విజయం దక్కించుకున్న అదే రాజస్తాన్‌ తాజాగా ఆర్‌సీబీతో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది.

చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top