
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో లీగ్ దశ నుంచి నాకౌట్ దశకు అర్హత పొందిన చివరి జట్టు ఉక్రెయిన్ ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గ్లాస్గో (స్కాట్లాండ్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో లీగ్ దశ నుంచి నాకౌట్ దశకు అర్హత పొందిన చివరి జట్టు ఉక్రెయిన్ ఏకంగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ 2–1 గోల్స్ తేడాతో స్వీడన్ జట్టును ఓడించి ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.
అదనపు సమయం కూడా ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా ఉక్రెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అర్తెమ్ డావ్‌బిక్ ‘హెడర్’ షాట్‌తో గోల్ చేసి స్వీడన్ కథను ముగించాడు. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. శుక్రవారం మొదలయ్యే క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో స్విట్జర్లాండ్; ఇటలీతో బెల్జియం; చెక్ రిపబ్లిక్‌తో డెన్మార్క్; ఇంగ్లండ్‌తో ఉక్రెయిన్ తలపడతాయి.
ఇక్కడ చదవండి: UEFA EURO 2020: ఫ్రాన్స్ చేజేతులా...