U19 WC: India Captain, Vice-Captain & 5 Others Tested Positive For Covid Says Reports - Sakshi
Sakshi News home page

U19 WC: టీమిండియాలో కరోనా కలకలం.. కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌..!

Jan 19 2022 9:26 PM | Updated on Jan 20 2022 8:51 AM

U19 WC: India Captain, Vice Captain Tested Positive For Covid Says Reports - Sakshi

ట్రినిడాడ్‌: అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారని సమాచారం. కెప్టెన్ యశ్ ధుల్‌ గైర్హాజరీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌.. 40 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(79), హర్నూర్‌ సింగ్‌(88) శుభారంభాన్ని అందించగా, రాజ్‌ భజ్వా(23 నాటౌట్‌), నిషాంత్‌ సంధు(20 నాటౌట్‌) నిలకడగా ఆడుతున్నారు. 
చదవండి: IND VS SA 1st ODI: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement