Tragic Incident 22-Year-Old Dies While Playing Cricket In Pune - Sakshi
Sakshi News home page

విషాదం.. క్రికెట్‌ ఆడుతూ కన్నుమూత

Jun 14 2022 10:18 AM | Updated on Jun 14 2022 11:47 AM

Tragic Incident 22-Year-Old Dies While Playing Cricket In-Pune - Sakshi

పుణేలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా మృతి చెందిన యువకుడి పేరు శ్రీతేజ్‌ సచిన్‌ గులే అని తెలిసింది.

ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడడానికి వచ్చాడు. మ్యాచ్‌ మధ్యలో శ్రీతేజ్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భయపడిన అతని స్పేహితులు పరిగెత్తుకొచ్చినప్పటికి అప్పటికి శ్రీతేజ్‌ సృహలో లేడు. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీంతో షాక్‌ తిన్న అతని స్నేహితులు శ్రీతేజ్‌ సచిన్‌ మరణవార్తను అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా శ్రీతేజ్‌ పుణేలోని హదప్సార్‌ ఏరియాలో నివసిస్తున్నారు.

చదవండి:  మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ..

Advertisement
 
Advertisement
Advertisement