
ఇంగ్లండ్లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ నిన్నటితో (ఆగస్ట్ 5) ముగిసింది. ఈ సిరీస్ వీరోచితమైన పోరాటాల తర్వాత 2-2తో సమమైంది. చివరిదైన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సినంత మజాను అందజేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఇంగ్లండ్‌ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.
నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్లపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. టీమిండియా మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతుందని ఫ్యాన్స్ శోధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా తదుపరి షెడ్యూల్ను మీ ముందుంచుతున్నాము.
టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా నెలకు పైగా బ్రేక్ తీసుకుంటుంది. తదుపరి మ్యాచ్ను వచ్చే నెల 10న ఆసియా కప్లో భాగంగా యూఏఈతో ఆడనుంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అబుదాబీ, దుబాయ్ల్లో జరుగనుంది.
ఈ ఖండాంతర టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగనుంది. అనంతరం భారత్ సెప్టెంబర్ 19న ఒమన్తో అబుదాబీలో పోటీపడనుంది. ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్ ఈ మూడు మ్యాచ్లు ఆడనుంది.
ఆసియా కప్ సూపర్-4 స్టేజీలో మ్యాచ్లు (భారత్ గ్రూప్-ఏలో ఉంది)
B1 vs B2 - 20 సెప్టెంబర్ 2025, దుబాయ్
A1 vs A2 - 21 సెప్టెంబర్ 2025, దుబాయ్
A2 vs B1 - 23 సెప్టెంబర్ 2025, అబుదాబి
A1 vs B2 - 24 సెప్టెంబర్ 2025, దుబాయ్
A2 vs B2 - 25 సెప్టెంబర్ 2025, దుబాయ్
A1 vs B1 - 26 సెప్టెంబర్ 2025, దుబాయ్
సెప్టెంబర్ 28- ఫైనల్ (దుబాయ్)
భారత్ వర్సెస్ వెస్టిండీస్ (స్వదేశంలో)
అక్టోబర్ 2-6: తొలి టెస్ట్, అహ్మదాబాద్
అక్టోబర్ 10-14: రెండో టెస్ట్, ఢిల్లీ
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియాలో)
అక్టోబర్ 19: తొలి వన్డే, పెర్త్
అక్టోబర్ 23: రెండో వన్డే, అడిలైడ్
అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీ
అక్టోబర్ 29: మొదటి టీ20 కాన్బెర్రా
అక్టోబర్ 31: రెండో టీ20, మెల్బోర్న్
నవంబర్ 2: మూడో టీ20, హోబర్ట్
నవంబర్ 6: నాలుగో టీ20, కర్రారా
నవంబర్ 8: ఐదో టీ20, బ్రిస్బేన్
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (స్వదేశంలో)
నవంబర్ 14-18: తొలి టెస్ట్, కోల్కతా
నవంబర్ 22-26: రెండో టెస్ట్, గౌహతి
నవంబర్ 30: తొలి వన్డే, రాంచీ
డిసెంబర్ 3: రెండో వన్డే, రాయ్పూర్
డిసెంబర్ 6: మూడో వన్డే, వైజాగ్
డిసెంబర్ 9: తొలి టీ20, కటక్
డిసెంబర్ 11: రెండో టీ20, చండీఘడ్
డిసెంబర్ 14: మూడో టీ20, ధర్మశాల
డిసెంబర్ 17:నాలుగో టీ20, లక్నో
డిసెంబర్ 19: ఐదో టీ20, అహ్మదాబాద్