T20 WC IND Vs SA: సౌతాఫ్రికాను గెలిపించిన 'కిల్లర్‌' మిల్లర్‌

T20 World Cup 2022: India Vs South Africa Match Live Updates-Highlights - Sakshi

టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. మిల్లర్‌(59 పరుగులు నాటౌట్‌) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించగా.. అంతకముందు మార్క్రమ్‌(52 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక దశలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఫీల్డర్ల తప్పిదం కలిసొచ్చి ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 2 వికెట్లు తీయగా.. మహ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రొటీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 15, కోహ్లి 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎన్గిడి 4 వికెట్లు తీయగా.. పార్నెల్‌ 3, అన్‌రిచ్‌ నోర్ట్జే ఒక వికెట్‌ తీశాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
► టీమిండియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మార్క్రమ్‌(52) రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. టీమిండియా ఫీల్డర్ల తప్పిదంతో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్క్రమ్‌ ఫిప్టీతో మెరిశాడు. మిల్లర్‌ 31, స్టబ్స్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ప్రొటిస్‌ విజయానికి 27 బంతుల్లో 34 పరుగులు అవసరం ఉంది.

9 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 35/3
► 9 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. మార్ర్కమ్‌ 20, డేవిడ్‌ మిల్లర్‌ 3 పరుగులతో ఆడుతున్నారు.

25 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో సౌతాఫ్రికా
► సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా(10) రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో బ్యాక్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌ కార్తిక్‌ క్యాచ్‌ పట్టుకోవడంతో పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రొసౌ డకౌట్‌..  రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
► అర్ష్‌దీప్‌ సింగ్‌ సౌతాఫ్రికాను మరోసారి దెబ్బ తీశాడు. లాస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. 

సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్‌
► 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లోనే స్టార్‌ బ్యాటర్‌ డికాక్‌ ఔటయ్యాడు. అర్షదీప్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి డికాక్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 

సూర్యకుమార్‌ ఒక్కడే.. టీమిండియా 133/9; సౌతాఫ్రికా టార్గెట్‌ 134
► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రొటీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 15, కోహ్లి 12 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎన్గిడి 4 వికెట్లు తీయగా.. పార్నెల్‌ 3, అన్‌రిచ్‌ నోర్ట్జే ఒక వికెట్‌ తీశాడు.

► దినేశ్‌ కార్తిక్‌(6) రూపంలో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన కార్తిక్‌ 14 బంతులాడి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వేన్‌ పార్నెల్‌ బౌలింగ్‌లో రొసౌకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అర్థశతకంతో చెలరేగిన సూర్య.. 
► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ కీలక సమయంలో అర్థసెంచరీతో మెరిశాడు. టీమిండియా బ్యాటర్లంతా విఫలమైన వేళ తాను ఒంటరిపోరాటం చేసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో సూర్యకు ఇది రెండో​హాఫ్‌ సెంచరీ. ఇక​ టీమిండియా ప్రస్తుతం 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.

నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌.. 13 ఓవర్లలో 84/5
► టీమిండియా టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన వేళ సూర్యకుమార్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి దినేశ్‌ కార్తిక్‌ నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ 37, కార్తిక్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

11  ఓవర్లలో టీమిండియా 67/5
► 11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 67 పరగులు చేసింది. సూర్యకుమార్‌ 23, దినేశ్‌ కార్తిక్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

49 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో టీమిండియా
► సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. 2 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యా ఎన్గిడి బౌలింగ్‌లో షాట్‌ ఆడే ప్రయత్నంలో రబాడ స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకోవడంతో పెవిలియన్‌ చేరాడు.

► టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. ఎన్గిడి బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి థర్డ్‌మన్‌ దిశగా సిక్సర్‌ బాదే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న రబాడ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియా మూడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.

తీరు మారని రాహుల్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
► టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఫేలవ్‌ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎన్గిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌ మీద వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్నాడు. ఫలితంగా మార్క్రమ్‌ క్యాచ్‌ తీసుకోవడంతో రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ(15) ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
► రోహిత్‌ శర్మ(15) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఎన్గిడి బౌలింగ్‌లో రోహిత్‌ కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది.

3 ఓవరల్లో టీమిండియా 14/0
► 3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. వేన్‌ పార్నెల్‌ వేసిన తొలి ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ చాలా ఇబ్బందిగా కనిపించాడు. ఆ ఓవర్‌ మెయిడెన్‌గా ముగిసింది. ఇక రబాడ వేసిన రెండో ఓవర్‌ నాలుగో బంతిని  రోహిత్‌ భారీ సిక్సర్‌ బాదాడు. ఇక మూడో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా మరో సిక్సర్‌ కొట్టాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా
► టి20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్‌ 12’ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఆసక్తికరంగా తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ గెలిస్తే సెమీఫైనల్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో దీపక్‌ హుడా తుది జట్టులోకి వచ్చాడు. అటు సౌతాఫ్రికా కూడా తబ్రెయిజ్‌ షంసీ స్థానంలో ఎన్గిడిని తుది జట్టులోకి తీసుకుంది.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

కేఎల్‌ రాహుల్‌ మినహా ప్రతీ ఆటగాడు తమదైన రీతిలో గత రెండు విజయాల్లో తగిన పాత్ర పోషించారు. దాంతో రాహుల్‌ స్థానంలో ఓపెనర్‌గా పంత్‌ ఆడవచ్చని వినిపించింది. అయితే బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్‌ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది. 140–150 కిలోమీటర్ల వేగంతో పాటు బంతిని స్వింగ్‌ చేస్తున్న రబడ, నోర్జేలను సమర్థంగా ఎదుర్కోవడంపైనే టీమిండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే తప్పు లేదు. బౌన్సీ పిచ్‌పై ఆరంభంలోనే కోహ్లి, రోహిత్, సూర్యకుమార్‌ ఎదురు దాడి చేస్తారా లేక సగం ఇన్నింగ్స్‌ వరకు జాగ్రత్తగా నిలబడి ఆపై దూకుడు ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరం.

దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడైన రిలీ రోసో సమరోత్సాహంతో ఉన్నాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టి20లోనే అతను శతకం బాదాడు. డికాక్, మిల్లర్‌ రూపంలో ఇద్దరు మెరుపు బ్యాటర్లు ఉండగా, మార్క్‌రమ్‌ మిడిలార్డర్‌లో జట్టుకు వెన్నెముక. యువ ఆటగాడు స్టబ్స్‌ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-10-2022
Oct 30, 2022, 21:11 IST
మన్కడింగ్‌(నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌ రనౌట్‌) అనగానే మొదటగా గుర్తుకువచ్చేది రవిచం‍ద్రన్‌ అశ్విన్‌. ఐపీఎల్‌లో జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేయడం ద్వారా అశ్విన్‌...
30-10-2022
Oct 30, 2022, 19:46 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఫేలవమైన ఫీల్డింగ్‌ టీమిండియా కొంపముంచుతుంది. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...
30-10-2022
Oct 30, 2022, 18:46 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్‌ 30) జరుగుతున్న కీలక సమరంలో టీమిండియా కెప్టెన​ రోహిత్‌ శర్మ...
30-10-2022
Oct 30, 2022, 18:44 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన...
30-10-2022
Oct 30, 2022, 17:59 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ...
30-10-2022
Oct 30, 2022, 17:21 IST
టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఫేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్‌లో కూడా రాహుల్‌ అదే...
30-10-2022
Oct 30, 2022, 17:09 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 30) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ బాస్‌ డి లీడ్‌...
30-10-2022
Oct 30, 2022, 16:10 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (అక్టోబర్‌ 30) జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం...
30-10-2022
Oct 30, 2022, 15:54 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో ఆదివారం జింబాబ్వేతో జరిగిన పోరులో బంగ్లాదేశ్‌ ఉత్కంఠ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి...
30-10-2022
Oct 30, 2022, 15:22 IST
టీ20 ప్రపంచకప్‌-2022 సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకకు పసికూన నమీబిమా షాకివ్వగా.....
30-10-2022
Oct 30, 2022, 14:32 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో ఇవాళ (అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌...
30-10-2022
Oct 30, 2022, 12:28 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 30) పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత...
30-10-2022
Oct 30, 2022, 11:20 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో అదరగొడుతున్న టీమిండియాపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మెగా ఈవెంట్‌...
30-10-2022
Oct 30, 2022, 10:29 IST
టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు రాణించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత...
30-10-2022
Oct 30, 2022, 09:58 IST
టీ20 ప్రపంచకప్‌-2022 (గ్రూప్‌-2)లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌...
30-10-2022
Oct 30, 2022, 08:13 IST
టీ20 ప్రపంచకప్‌-2022 (సూపర్‌-12)లో భాగంగా కీలక పోరులో బంగ్లాదేశ్‌తో జింబాబ్వే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత...
30-10-2022
Oct 30, 2022, 07:46 IST
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సరికొత్త అవతరమెత్తనుంది. టీ20 ప్రపంచకప్‌-2022లో కామెంటేటర్‌గా మిథాలీ రాజ్‌ వ్యవహరించనుంది..ఈ...
30-10-2022
Oct 30, 2022, 05:55 IST
సిడ్నీ: శ్రీలంక అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో 15 పరుగులకే 3 న్యూజిలాండ్‌ వికెట్లను పడగొట్టింది. ఏడో ఓవర్లో నిసాంక...
30-10-2022
Oct 30, 2022, 05:36 IST
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆట కట్టించేశాం... ఆపై చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌ను ఓడించేశాం... లీగ్‌ దశలో చివరి రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్,...
29-10-2022
Oct 29, 2022, 21:58 IST
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన మాజీ...



 

Read also in:
Back to Top