SA Vs ENG : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్‌కు.. | T20 World Cup 2021: SA Vs ENG Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

SA Vs ENG : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్‌కు..

Nov 6 2021 7:00 PM | Updated on Nov 6 2021 11:31 PM

T20 World Cup 2021: SA Vs ENG Match Live Updates And Highlights - Sakshi

ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్‌కు..
చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై  దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్‌లో 14 పరుగుల కావల్సిన నేపథ్యంలో కగిసో రబడా హ్యట్రిక్‌ వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఆలీ(37), మలాన్‌(33),లివింగ్‌స్టోన్(27) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమిస్‌కు ఆర్హత సాధించలేక పోయింది.

కాగా అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్‌ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.  వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్‌ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్‌(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్‌ సాధించారు

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. మలాన్‌(33) ఔట్‌
146 పరుగుల వద్ద మలాన్‌(33) రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్(27), మోర్గాన్‌(5) పరుగులతో క్రీజులో  పరుగులతో ఉన్నారు.

రెండో  వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బెయిర్‌స్టో(1) ఔట్‌
59 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తబ్రైజ్ షమ్సీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఎల్బీగా వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(31), మలాన్‌(20) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్‌ రాయ్‌ రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. బట్లర్‌(26) ఔట్‌
సమయం: 21:59.58 పరుగుల వద్ద బట్లర్‌ రూపంలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులు చేసిన బట్లర్‌, నోర్ట్జే బౌలింగ్‌లో బావుమాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(8), బెయిర్‌స్టో(1) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్‌ రాయ్‌ రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

చేలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 190 పరుగులు
ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్‌ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది.  వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్‌ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్‌(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్‌ సాధించారు. 130 పరుగులలోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేస్తే దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది.

15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 118/2
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేలరేగి ఆడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో వాన్ డెర్ డస్సెన్(61), మారక్రమ్‌(15) పరుగులతో ఉన్నారు. 

నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా.. 6 ఓవర్లకు 49/1
సమయం: 19:59..  ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(22), వాన్ డెర్ డస్సెన్(23) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. హెండ్రిక్స్(2) ఔట్‌
సమయం: 19:45 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెండ్రిక్స్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన హెండ్రిక్స్  మోయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి  16 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(11), వాన్ డెర్ డస్సెన్(1) పరుగులతో ఉన్నారు.



షార్జా: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా శనివారం(నవంబర్‌​6) దక్షిణాఫ్రికా కీల​క మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే నవంబర్‌​6న జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి సెమిస్‌కు అడుగు దూరంలో నిలిచింది. దీంతో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధిస్తే మెరుగైన రన్ రేట్‌తో సెమిస్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇరుజట్లు టీ20 ప్రపంచకప్‌లో ముఖాముఖి ఆరు సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా 3 సార్లు గెలుపొందగా, 2 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు.

ఇంగ్లండ్‌:  జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్‌కీపర్‌), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్,  వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, టెంబా బావుమా (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

చదవండి: SA Vs ENG : టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement