
Sunil Gavaskar Commnets On Team India Pakistan Clash: వేగంగా మారే టి20 ఫార్మాట్‌లో ఆటగాళ్లను సన్నద్ధపరచడంలోనే మెంటార్ సహాయపడగలడని... అసలు బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. ‘బయట నుంచి సలహాలివ్వడం, వ్యూహాలు పన్నడం మాత్రమే మెంటార్‌గా ధోని పని. కానీ అసలు పని మైదానంలో దిగే ఆటగాళ్లదే. ఒత్తిడిని తట్టుకోవడం, అప్పజెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించడం ఆటగాళ్లే చేయాలి’ అని సన్నీ వివరించారు.
టీ20 ఫార్మాట్‌లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదన్న గావస్కర్... ఆదివారం నాటి టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఏ జట్టునూ ఫేవరెట్‌గా భావించవద్దని సూచించారు. అవసరమైన సమయంలో ఒత్తిడిని జయించి... నో బాల్స్ వంటి తప్పిదాలు చేయకుండా ఉన్న జట్టునే విజయం వరిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 24న టీమిండియా- పాకిస్తాన్ మధ్య జరిగే పోరు కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
చదవండి: T20 World Cup: అప్పటి నుంచి టీమిండియా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు!