
ఎవరు ఎంత కొడతారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అనేదానిపై కూడా రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
T20 World Cup 2021 Ind vs Pak Match Today: టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆదివారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. మరి... దాయాదుల పోరు అంటేనే భావోద్వేగాలు పెల్లుబికే సమయం కదా. అందుకే ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రెడీ అయిపోయారు. ఆన్‌లైన్ వేదికగా బెట్టింగ్ నిర్వహణకు తెరతీశారు.
ఇందులో భాగంగా... ఫస్ట్‌బాల్ నుంచి లాస్ట్‌బాల్ వరకు బెట్టింగ్‌లకు ప్లాన్ చేశారని సమాచారం. ఎవరు ఎంత కొడతారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు అనేదానిపై కూడా రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, యువ సంచలనం రిషభ్ పంత్‌పైనే ఎక్కువ బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్, బయట మార్కెట్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న తీరు
►ఆన్‌లైన్ మార్కెట్‌లో పాక్‌పై రూ. వెయ్యికి రూ. 1600
►బయట మార్కెట్‌లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 2 వేలు
►ఆన్‌లైన్ మార్కెట్‌లో భారత్‌పై రూ. వెయ్యికి రూ. 530
►బయట మార్కెట్‌లో పాక్‌పై రూ. వెయ్యికి రూ.4 వేలు
చదవండి: Babar Azam: మా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్‌తో మాట్లాడాము