Adil Rashid: టి20 ప్రపంచకప్‌లో ఆదిల్‌ రషీద్‌ అరుదైన రికార్డు

T20 World Cup 2021: Cheapest Four Plus Wicket Haul In T20 World Cups - Sakshi

Adil Rashid: టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా  వెస్టిండీస్‌ జరుగుతున్న మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ అరుదైన రికార్డు సాధించాడు. టి20 ప్రపంచ కప్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి.. 4 వికెట్ల హాల్‌ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించి రషీద్‌ ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా పొట్టి ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా రషీద్‌ రికార్డులెక్కాడు. అంతకు ముందు శ్రీలంక స్పిన్నర్‌ రంగనా హెరత్‌ కేవలం 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఇంగ్లండ్‌ జట్టులో బట్లర్‌ 24 పరుగులతో నటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అం​దించాడు. విండీస్‌ బౌలర్లలో అకేల్‌ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్‌ ఓడి భ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కూప్ప కూలిపోయింది. విండీస్‌ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్‌ గేల్‌ తప్ప ఒక్కరు కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ దాట లేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా,  టైమల్ మిల్స్‌ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ సాధించారు.
చదవండి: T20 WC 2021 ENG Vs WI: 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top