T20 World Cup 2021: మంచి ఫామ్‌లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు

T20 WC: Deepak Chahar Good Form Unlucky To Be Left Out of Squad: Ian Bishop - Sakshi

Ian Bishop Comments On Deepak Chahar: టీ20 ప్రపంచకప్‌ జట్లలో మార్పులకు అక్టోబరు 10 వరకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో తాజా ఫామ్‌ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టీ20 వరల్డ్‌కప్‌ జట్టులోని వారి స్థానాలను శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ వంటి ఆటగాళ్లతో భర్తీ చేయడం బెటర్‌ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక బౌలింగ్‌ విభాగంలోనూ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో దీపక్‌ చహర్‌ను ఆడిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలో వెస్టిండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ భువీ, దీపక్‌ మధ్య పోలికలు, తాజా ఫామ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ... ‘‘టీ20 జట్టులో ఎంపిక కాని... దీపక్‌ చహర్‌ దురదృష్టవంతుడనే చెప్పాలి. భువీ గత ప్రదర్శన, అనుభవం రీత్యా అతడికే సెలక్టర్లు ఓటు వేసి ఉంటారన్న విషయాన్ని అర్థం చేసుకోగలను. కానీ.. ప్రస్తుతం దీపక్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరే ఇతర బౌలర్‌కు సాధ్యం కాని విధంగా బాల్‌ను స్వింగ్‌ చేస్తున్నాడని నా అభిప్రాయం.

ఇంకో విషయం.. డెత్‌ ఓవర్లలో భువీ స్పెషలిస్టు అన్న విషయం తెలిసిందే. అయితే, తాజా ఐపీఎల్‌ సీజన్‌లో అతడి కంటే దీపక్‌ చహర్‌ మెరుగ్గా బౌల్‌ చేస్తున్నాడని అంగీకరించక తప్పదు’’ అని పేర్కొన్నాడు. భువీ స్థానంలో దీపక్‌ను ఎంపిక చేస్తే మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్‌-2021లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చహర్‌.. 7.75 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ భువీ... ఆడిన 8 మ్యాచ్‌లలో 8.53 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. 

చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో వీరికి అవకాశం ఇస్తే మంచిదేమో!
Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top