
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా ‘బిగ్‌బాస్ 19’( Bigg Boss 19) ఆగష్టులో మొదలైంది. హిందీలో కొనసాగుతున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఈ షోలోకి భారత క్రికెటర్ అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్‌లో వైరల్ అవుతుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.

ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malti Chahar) హిందీ బిగ్‌బాస్-19లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ పలు సినిమాల్లో కూడా నటించింది. సోషల్‌మీడియాలో ఆమె కంటెంట్ క్రియేటర్‌గా కూడా రాణిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాల్తీకి సుమారు పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె 2014లో ఫెమినా మిస్ ఫోటోజెనిక్, మిస్ సుడోకు కిరీటాలను గెలుచుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది.