T20 WC 2021: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

T20 WC 2021 IND Vs PAK: Baba Ramdev Sensational Statement - Sakshi

Baba Ramdev Sensational Statement Over India, Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య ఇవాళ జరగనున్న ఫై ఓల్టేజ్‌ పోరు నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ పక్క దేశంలో ఉగ్ర క్రీడ పేట్రేగిపోతుంటే.. క్రికెట్‌ ఆడడమేంటని ప్రశ్నించాడు. క్రికెట్‌, ఉగ్రక్రీడ రెండూ ఒకేసారి ఆడలేరని.. ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు, రాజ ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నాడు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు క్రికెట్‌ ఆడడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కాగా, దేశంలో ఉగ్రదాడులు అను నిత్యం ఏదో ఒక చోట జరుగుతూ ఉంటే భారత్‌-పాక్‌లు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రుల దగ్గరి నుంచి సామాన్యుల వరకు మ్యాచ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket అనే హ్యాష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
చదవండి: Virat Kohli: ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top